Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

వసతులు మరియు సదుపాయాలు

వసతులు మరియు సదుపాయాలు

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ అనేది కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పెద్ద ఆసుపత్రులలో ఒకటి. ఈ తృతీయ సంరక్షణా ఆసుపత్రి, 350 పడకల సామర్థ్యంతో, అత్యాధునిక వ్యాధినిర్ధారణా సదుపాయాలను కలిగి ఉంది. దీనిలో ప్రస్తుతం 240 పడకలు నిర్వహించబడుచున్నాయి. ఈ ఆసుపత్రి, సమగ్ర తృతీయ సంరక్షణా ప్రత్యేకతలకు పేరెన్నికగన్నది.

వసతులు మరియు సదుపాయాలు

  • వసతులు
  • సదుపాయాలు

మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ వద్ద వసతులు, భారతదేశంలోనే అత్యత్తమమైనవిగా ఉన్నాయి. మా ఆసుపత్రులలో మీరు చూడగల ఆవశ్యక వసతులలో కొన్ని ఇక్కడ సూచిస్తున్నాము:

  • ప్రాథమిక వైద్యునితో సహకరించు అత్యుత్తమ అనుభవం కలిగిన బహుళశాఖా నిపుణుల బృందం ద్వారా, వారి విశిష్టమైన నైపుణ్యం, సామర్థ్యంతో రోగులకు ఉత్తమ ఫలితాలను అందించడానికి దారితీయగల ముఖ్యమైన చికిత్సాపూర్వక సమాచారాన్ని సమన్వయ పరచుటకు, అత్యుత్తమ ఆధునిక సామగ్రిని ఉపయోగించుటకు మరియు సహకార వ్యక్తిగత సంరక్షణల సేవలను సమన్వయపరచబడి, మా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ రూపంలో అందించబడుతుంది.
  • తక్షన పికప్/డ్రాప్ కొరకు ఇరవైనాలుగు గంటలు రవాణా-అత్యవసర పరిస్థితి ఆంబులెన్స్ సేవలు
  • ప్రత్యేక నర్సు – ఒకవేళ జబ్బుపడిన లేదా ముదుసలి రోగికి ప్రత్యేక సంరక్షణ అవసరమైతే, మీకు సహాయం కావాల్సినప్పుడెల్లా ఒక ప్రత్యేక నర్సును సహాయకానికి నియమించగలము. మా డెస్క్ ను సంప్రదించండి, మరియు మేము మీ కొరకు ప్రత్యేక నర్సును తక్షణమే నియమిస్తాము.
  • బాగా నిర్వహించబడిన క్యాంటీన్లు – మా క్యాంటీన్లలో ఆధునిక క్యాంటీన్ సదుపాయాలు ఉన్నాయి, మీకు ఉపశమనం కలిగించగల ఆహారాలు మరియు పానీయాలను మీరు ఇక్కడ పొందవచ్చు.
  • 24 గంటల సేవ – ఎన్‌ఐసియు నుండి సంపూర్ణ 24 గంటల సహకారం మరియు నిశిత సంరక్షణా సదుపాయాలు, రక్త నిధి, ఆపరేషన్ థియేటర్, అనస్తీషియా మరియు ల్యాబొరేటరీ సేవలు.
  • ప్రసూతి సదుపాయాలు – ప్రసూతి కొరకు మావద్ద ప్రత్యేకమైన సదుపాయాలున్నాయి. వీటిలో బర్తింగ్ సూట్, ప్రసూతి కాన్పు గదులు, వ్యాధినిర్ధారించు భ్రూణ సిటిజి, ప్రసూతి అనాల్జెషియా, అధిక ప్రమాదంగల గర్భధారణ, ఇక్కడ సురక్షితంగా మరియు జాగ్రత్తగా నిర్వహించబడుతుంది.

గదుల విభాగాలు

మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో 5 రకాల గదుల విభాగాలు అందుబాటులో ఉన్నాయి:

  • జనరల్ వార్డు (ఒక్కొక్క గదికి 8-10 రోగులు)
  • ఎసి జనరల్ వార్డు (ఒక్కొక్క గదికి 8-10 రోగులు)
  • సెమి ప్రైవేట్ ఎ/సి (ఇద్దరు ఉండవచ్చు)
  • డీలక్స్
  • సూపర్ డీలక్స్ (సూట్)
సహాయకుని మంచం, టెలివిజన్ సదుపాయం మరియు నియంత్రించగల ఎ/సొ సర్వీస్ తో సింగిల్ రూమ్ సదుపాయం

X

Please Enter Details

Type verification

reload png