Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

ఎముక మూలగ మార్పిడి విభాగము  & 

మణిపాల్ హోంకేర్ సర్వీసులు

విజయవాడ, మే 20, 2016: మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ అనేది ఒక సమగ్రమైన మూలకణజాల ఎముక మూలగ మార్పిడి విభాగాన్ని ఆవిష్కరించడంలో ఆంధ్ర ప్రదేశ్ లోనే మొట్టమొదటి హాస్పిటల్. నగరంలోని క్యాన్సర్ రోగులకు సేవలనందించాలని మరియు మెరుగైన 35 పడకల డే కేర్ కెమోథెరపీ సేవలను అందించాలనే దృక్పథంతో, నేడు బ్లడ్ క్యాన్సర్ బాధితుల కొరకు ఒక ప్రత్యేకమైన వార్డును శ్రీ కామినేని శ్రీనివాస్ (ఆరోగ్య మరియు వైద్య విద్యా మంత్రి) మరియు డా. అజయ్ బక్షి, ఎండి&సిఇఓ మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రారంభించబడింది.

అదనంగా, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ తన బ్రాండ్ నేమ్ మణిపాల్ హోంకేర్ క్రింద గృహ ఆరోగ్య సంరక్షణా సేవలను ఆవిష్కరించింది. ఈ ప్రారంభకం ద్వారా, మణిపాల్ హాస్పిటల్, తన హాస్పిటల్ సేవల యొక్క ఒక విస్తృత సరళిని, రోగి యొక్క ముంగిటే అందిస్తోంది. ఇది తల గాయానికి చికిత్స జరిపిన తరువాత డిశ్చార్జ్ చేయబడినవారికి, కాన్సర్ రోగులకు, దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాధపడుచున్న రోగులకు (అనగా మధుమేహం, గుండె జబ్బులు, సిఓపిడి వంటి శ్వాసకోస జబ్బులు మొదలగునవి) ప్రత్యేకంగా ప్రయోజనకారిగా ఉంటుంది. మచలీపట్నం, నూజివీడు, గుడివాడ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలోని వారికి ఆసుపత్రిలో దీర్ఘకాలం పాటు ఉండి డిశ్చార్జ్ అగు వారికి తగిన సంరక్షణ అవసరమగు రోగుల విషయంలో ఈ గృహ సంరక్షణ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది.


“ఆరోగ్య సంరక్షణ పొందడం పట్ల మరియు అందుబాటులో ఉంచడం పట్ల మణిపాల్ హాస్పిటల్స్ నిరంతరంగా పనిచేస్తోంది. సమగ్ర ఎముక మూలగ మార్పిడి విభాగ ఆవిష్కరణతో, మరియు గృహ ఆరోగ్య సంరక్షణ సేవల అనుబంధంతో, ఇది వైద్యులకు మరియు రోగులకు కూడా లబ్ధికారక పరిస్థితిని కల్పిస్తుంది. కాన్సర్ అనేది ప్రజానీకంలో కూడా సాధారణంగా మారుతున్న సందర్భంలో, మేము దానిని నయం చేయడానికి విజయవాడ ప్రజల ఇంటి ముంగిటకే ఈ సేవలను తీసుకెళ్ళి వారి సమయం మరియు డబ్బును కూడా ఆదాచేస్తున్నాము. మణిపాల్ హోంకేర్ ద్వారా, మా సేవలను పొందాలనుకుని, దూరం మరియు ప్రయాణాల వలన రాలేకపోయిన అనేక మంది కూడా సేవలు అందించబడుచున్నాయి. తమ పిల్లలు తమనుండి దూరంగా ఉన్న సీనియర్ సిటిజన్ల ఆరోగ్యాన్ని నిరంతరంగా పర్యవేక్షించుటను కూడా ఈ హోంకేర్ వలన హాస్పిటల్ వారికి అందించుటకు వీలు కలుగుతుంది.


బ్లడ్ కాన్సర్ రోగులకు వ్యాధి నిరోధకత చాలా తక్కువగా ఉంటుంది మరియు అందుచేత వారికి అంటువ్యాధులు సులభంగా వ్యాపిస్తాయి. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి, ఈ ప్రమాదాలను తగ్గించి, వారు త్వరగా మరియు సులభంగా కోలుకునే విధంగా వీలుకల్పించాలి. ఈ విభాగంలో లుకేమియా మరియు రక్తానికి సంబంధించిన వ్యాధుల గురించి నిర్వహించబడుతుంది. మేము బ్లడ్ కాన్సర్, థలస్సేమియా, సికిల్ సెల్, అనీమియా, లింఫోమాలను నయంచేయగలము మరియు ఎముక మూలగ మార్పిడి ద్వారా మయేలొమాను నయం చేయగలము. “రెండు రకాల మార్పిడులు ఉన్నాయి, ఒకటి ఆటోలోగస్ మూల కణ మార్పిడి, దీనిలో రోగి నుండి మూల కణాలను సేకరించి, చికిత్స అనంతరం వాటినే రోగిలోనికి ఇంజక్ట్ చేయబడతాయి మరియు రెండవది ఆలోజెనిక్ మూలకణ మార్పిడి, ఇందులో రోగి యొక్క బంధువుల నుండి మూల కణాలను సేకరించి, రోగులకు చికిత్స అందించబడుతుంది, ఇవి రెండూ మా కేంద్రంలో లభ్యమవుతాయి.”ఈ హాస్పిటల్, అత్యాధునిక సామగ్రితో 6 పడకల మూలకణజాల విభాగంతో ప్రారంభించబడింది. అంకితమైన 24 గంటల రక్తనిధి, పాథాలజీ, మైక్రోబయాలజీ మరియు హెమటాలజీలతో సంసిద్ధమై ఉంది. ఆంకాలజీ విభాగంలో మొత్తం 35 పడకలున్నాయి, వీటిలో 5 ఆంకాలజీ ప్రైవేట్ గదులు, ఇద్దరు పంచుకునే విధంగా 12 పడకలు, కెమోథెరపీ జనరల్ వార్డు కొరకు 8 పడకలు ఉన్నాయి


“మా హోం హెల్త్‌ కేర్ సర్వీసుతో ఎముక మూలగ మార్పిడి కేంద్రాన్ని ఆవిష్కరించడానికి మాకెంతో ఆనందంగా ఉంది. మణిపాల్ హోంకేర్ అనేది ఆంధ్ర ప్రదేశ్ లోని నిర్వాహక విభాగాలలో మొట్టమొదటి మరియు అతిపెద్ద హోంకేర్ అందించు ఒక విభాగం. హోంకేర్ ద్వారా రోగుల ఇంటివద్దే, మా ఆసుపత్రి సేవల అనేక రకాలను అంటే నర్సింగ్, ఫిజియోథెరపీ, రక్త పరీక్షలు, వైద్యునితో సంప్రదింపులు, కిరాయికి వైద్య సామగ్రిని అందించడం, మరియు ఫార్మసీ వంటి సేవలను అందించగలుగుతున్నాము. ఈ సంరక్షణ, మా ఆసుపత్రిలో శిక్షణ పొందిన మరియు మంచి అనుభవం గల వైద్య సిబ్బంది ద్వారా అందించబడుతోంది.’

Articles Published in Newspaper

X

Please Enter Details

Type verification

reload png